ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా తయారైంది.  ముఖ్యంగా కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో వస్తున్న డబుల్ మీనింగ్ మాటలు..కామెంట్లు చూస్తుంటే అసలు మనం సమాజంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అన్న అనుమానాలు వస్తున్నాయి.  కొన్ని సార్లు బుల్లితెరపై లైవ్ లో కూడా అశ్లిల మాటలు మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.  
Image result
తాజాగా నాగ చైతన్య, రకూల్ ప్రిత్ సింగ్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావుని ఓ యాంకర్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అన్న ప్రశ్నకు వెంటనే మైక్ అందుకున్న చలపతి రావు..అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అన్న ప్రశ్నకు అదేమో కానీ అమ్మాయిలు పక్కలో పనికి వస్తారు అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు.  దీంతో యాంకర్ కి మైండ్ బ్లోయింగ్ కావడంతో ఏం చేయాలో తెలియక ఇది సెన్సార్ కట్ అంటూ వెళ్లింది.  అయితే దీనిపై ఇప్పుడు మహిళా సంఘాలు ఉవ్వెత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
Image result
ఓ చానల్ లో  చలపతిరావు చెంపలేసుకుని ఇంతటితో ఈ వ్యవహారాన్ని వదిలేయాలంటూ వేడుకున్నాడు. తన మాటలు మహిళలను బాధ పెట్టినందుకు క్షమించాల్సిందిగా కోరారు. అనాలోచితంగా తాను అన్న మాటలు ఇంత వివాదానికి దారి తీయడం తన ఖర్మంటూ వాపోయారు.  ఈ మద్య కొన్ని ఆడియో ఫంక్షన్లలో కొంత మంది చేస్తున్న వల్గర్ వ్యాఖ్యలకు ఎన్నో సార్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  అభ్యంతరకరంగాను, ఆక్షేపణీయంగాను ఉంటోంది. ఆ మధ్య బాలయ్య సైతం ఓ ఫంక్షన్ లో హీరోయిన్ల పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై రాష్ట్ర అసెంబ్లీని కుదిపేశాయి. చివరకు ఆయన అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పాల్సివచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: