అక్కినేని నాగచైతన్య నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు చలపతిరావు మహిళలను కించపరిచేలా సమాధానం ఇచ్చిన విషయం తెల్సిందే! దీనిపై ఆగ్రహించిన మహిళలు ఆయన పై మండిపడ్డారు. ఒక సినియర్ నటుడు అయి ఉండి మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.  

అంతే కాదు గత కొంత కాలంగా టెలివిజన్, సినిమాల్లో మహిళలపై నీచంగా చూపించడం..అసభ్యంగా ద్వందర్థాలు వచ్చేలా డైలాగ్స్ చెప్పడం చేస్తున్నారని ఇలాంటివి యువతను పక్కదారి పట్టిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.  అందుకే ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో సెలబ్రెటీలు మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినియర్ నటుడు చలపతి రావు పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతితోపాటు సామాజిక మహిళా కార్యకర్త దేవిలు నటుడిపై చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: