కోలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ నయనతార గురించి అందరికి తెలిసిందే. అక్కడ సూపర్ స్టార్స్ తో పాటుగా ఫీమేల్ లీడ్ సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్న అమ్మడు డిఫరెంట్ కథలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో చేస్తూనే తనకు నచ్చిన కొత్త కథలను ప్రయోగాలను సైతం చేసుకుంటూ వస్తుంది నయనతార.


ఇక సినిమాలతోనే కాదు తన లవ్ స్టోరీలతో కూడా సంచలనం సృష్టించిన అమ్మడు ప్రస్తుతం తన చివరి ప్రేమికుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తుందని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే మరోసారి ప్రభుదేవతో కలిసి ఓ సినిమాలో నటిస్తుందట నయనతార. శింభు తో ప్రేమాయణం నడిపిన తర్వాత నయన్ ప్రభుదేవతో కూడా పీకల్లోతు ప్రేమలో పడింది.


శ్రీరామరాజ్యం టైంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవడమే అన్నంత సీన్ చేసింది. తీరా చూస్తే మళ్లీ యధావిదిగానే ప్రభుదేవ, నయనతార ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ దెబ్బతో ఇక ఫుల్ గా సినిమాల మీదనే కాన్సెంట్రేట్ చేసి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార.


పర్సనల్ గా విడిపోయినా ఇప్పుడు మళ్లీ ప్రొఫెషనల్ గా తెర మీద కలిసి నటించనున్నారు ప్రభుదేవ నయనతారలు. పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ప్రభుదేవ హీరోగా చేస్తుండగా హీరోయిన్ గా ఎవరెవరినో అనుకుని చివరకు నయనతారను ఫైనల్ చేశారట. మొత్తానికి మళ్లీ ఈ ప్రేమ జంట తెర మీద జోడిగా కనిపించి అలరించనున్నారన్నమాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: