ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కాకుండానే మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ గా అందరి దృష్టి ఆకర్షిస్తన్న సమంత నాగచైతన్యల ప్రేమకధ తెలియనివారు ఉండరు. రాబోతున్న అక్టోబర్ లో పెళ్లి పీటలు  ఎక్క బోతున్న వీరిద్దరి పెళ్ళికి నాగార్జున తన అంగీకారం తెలపడంతో ఆమధ్య  గ్రాండ్ గా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ ప్రేమజంట  తమ పెళ్ళికి కాస్త టైం తీసుకుని ఈ లవ్ బర్డ్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 

ఈ లవ్ ట్రాక్ సమంత మీద ఎంత ప్రభావం చూపించిందన్న విషయాన్ని పక్కన పెడితే నాగచైతన్య మీద ఎంతగా ఉందన్న విషయాన్ని  నాగార్జున ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరిస్తూ నాగచైతన్య పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. చైతన్య లేటెస్ట్ గా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో చైతు నటనలో బాగా ఈజ్ కనిపించిందని అదంతా సమంత ఎఫెక్ట్ అని నాగ్ కామెంట్ చేసాడు. 

అంతేకాదు చైతూలో గతంలో కంటే ఎక్కువ ఈజ్ కనిపిస్తోందని మనిషి చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడని ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తున్నాడని నాగ్ చెప్పడమే కాకుండా ఇది అంతా సమంత ఎఫెక్ట్ ఏమో అంటూ నవ్వుతూ  జోక్ చేసాడు.  ఇదే సందర్భంలో తాను  సమంతను బలవంత పెట్టి సార్ అని కాకుండా మామయ్య అని పిలిపించుకోవడం మొదలు పెట్టిన సందర్భాన్ని వివరిస్తూ ఆ పిలుపు తనకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే అప్పుడే వయసు అయిపోయిందన్న ఫీలింగ్ తనలో కలుగుతోంది అంటూ తన పై తానే  సెటైర్లు వేసుకుంటున్నాడు నాగార్జున. 

తనను మధ్యవయస్కుడిగా అందరూ చూడాలన్న ఫీలింగ్ తనలో ఎక్కుకవగా ఉంది అని అంటూ అప్పుడే తన పిల్లలు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయాన్ని  గుర్తుకు చేసుకున్నప్పుడుల్లా తాను పెద్ద అయిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ నాగ్ తన పై తాను వేసుకుంటున్న సెటైర్లు ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి. ఇక మరో రెండురోజులలో విడదల కాబోతున్న చైతన్య ‘రారండోయి వేడుక చూద్దాం’ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని నాగ్ అనడం బట్టి ఈసినిమా పై అక్కినేని కాంపౌండ్ కు ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: