ఈ మద్య కొన్ని ఆడియో ఫంక్షన్లలో యాంకర్ గా వ్యవహరిస్తున్న వారు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఆడియో వేడుక సందర్భంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం..దానికి పడీ పడీ నవ్వడం కామన్ అయ్యింది.  అక్కడ సందర్భం ఎలా ఉన్న తర్వాత ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం సోషల్ మీడియాల్ హల్ చల్ చేయడం పరిపాటైంది.  తాజాగా ‘రారండోయ్ వేడుక చూద్దం’ ఆడియో వేడుకలో సీనియర్ నటులు చలపతి రావు అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై సెలబ్రెటీ ల నుంచి, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  అయితే ఇప్పడు తెరపైకొ కొత్త వ్యవహారం బయటకు వచ్చింది. చలపతిరావు అన్నది ముమ్మాటికీ తప్పే అయితే అదే సమయంలో మరో నటుడు అలీ అన్న మాటల సంగతేంటి ? దాని గురించి ఏంటి ? అని అంటున్నారు నెటిజన్లు. 

గతంలో ఆడియో వేడుకల్లో పబ్లిక్ గా యాంకర్లను పట్టుకొని బూతులు మాట్లాడిన ఆలీని ఎందుకు విడిచి పెట్టారు...ఆయన మాట్లాడితే జోకులు చలపతి రావు మాట్లాడితే బూతులా అంటున్నారు.   ఆలీ పలు రియాలిటీ షోలలో అలాగే ఆడియో ఈవెంట్ లలో పరమ బూతులు దావానలం లా పేల్చుతున్నారు .సమంత నడుము గురించి , అలాగే అనుష్క తొడల గురించి మాట్లాడి వివాదం సృష్టించిన అలీ బూతు జోకులు..రీసెంట్ గా అనసూయను పట్టుకొని ఎవడు పిలిస్తే వాడి వెంట వెళ్తావా అని అన్నాడు.  

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఆలీ..కొన్ని టీవి కార్యక్రమాల్లో వస్తున్న బూతు కంటెంట్ జోకులపై కూడా మహిళా లోకం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుందని అంటున్నారు.  ఆలీ కానీ మరొకరు కానీ బూతు జోకులు వేస్తుంటే చాలామంది పగలబడి నవ్వడం కామన్ అయ్యింది.  అంతేందుకు  రకుల్ ప్రీత్ సింగ్ కూడా చలపతిరావు అన్న బూతు కి పగలబడి నవ్వింది కానీ ఇప్పుడేమో అబ్బే ! కాదు అని చెబుతోంది పాపం . 
 


మరింత సమాచారం తెలుసుకోండి: