ఈ మద్య వెండితెర, బుల్లి తెర నటులు చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు. సెలబ్రెటీలు అయ్యాం..మేం ఏం చేసినా అడ్డుకునేది ఎవరూ అని వారి ఇష్టానుసారంగా ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా ఓ ఆడియో వేడుకలో సీనియర్ నటులు చలపతి రావు అమ్మాయిల గురించి అసహ్యంగా కామెంట్ చేయడంతో..సోషల్ మీడియాలో పెను దుమారం చెలరేగింది.  ఆయనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పోలీస్ కేసు కూడా పెట్టారు.  
actor balaji - nithya
ఇదిలా ఉంటే ఓ నటుడు తన భార్య పట్ల ఎప్పుడూ అనుమానిస్తూ..ఆమెను చిత్ర హింసలకు గురిచేయడంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ సంఘటన తమిళనాడు లో జరిగింది .  వివరాల్లోకి వెళితే..  తమిళనాట బాలాజీ ( 37) అనే వ్యక్తి యాంకర్ గా ఫేమస్ అయ్యాడు . నిత్య (28) ఏళ్ల దళిత యువతి ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు . వీరిద్దరూ చెన్నై నగర శివారు ప్రాంతమైన మాధవరంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప ఉంది.

సజావుగా సాగుతున్న వారి సంసారం కొన్ని నెలలుగా ఇబ్బందుల్లో పడింది. భార్యాభర్తలిద్దరి నడుమ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.   బాలాజీ కన్నడ బ్రాహ్మణుడు కాగా, నిత్య దళిత కులానికి చెందిన అమ్మాయి. తనను బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని కూడా నిత్య పేర్కొంది.  కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురి వద్ద విచారణ జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: