సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిన దగ్గరనుండి టీజర్ గురించి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్నోసార్లు ఇదుగో టీజర్ అదుగో టీజర్ అని వార్తలొచ్చినా టీజర్ మాత్రం రాలేదు. 


ఇక ఇప్పుడు మహేష్ టీజర్ ఈ నెల 31న రావడం పక్కా అని తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ సెట్స్ మీద ఉన్న ఏ సినిమా అయినా టీజర్ తో విష్ చేయడం ఆనవాయితి. స్పైడర్ టీజర్ ను కూడా మే 31న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  


ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తుండగా సినిమా అంతా మురుగదాస్ మార్క్ టేకింగ్ తో అదిరిపోతుందని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్ పరంగా కూడా స్పైడర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తుంది. 


బ్రహ్మోత్సవం నిరాశ మిగల్చడంతో రాబోతున్న స్పైడర్ ఎలాగైనా సరే రికార్డులతో చెడుగుడు ఆడాలని డిసైడ్ అయ్యాడు మహేష్. అందుకే సినిమా గురించి ప్రతి ఒక్క విషయంలో పక్కా ప్లానింగ్ తో నడుచుకుంటున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఆగష్టులో వస్తుంది అనుకున్న ఈ సినిమా సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. రెండు పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్టే అని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: