తమ అభిమాన నటుడి మీద ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే అతనైనా ఊరుకుంటాడేమో కాని ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో కాంప్రమైజ్ అవరు సరికదా అవతల వారు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తుంటారు. అలానే సరిగ్గా మహేష్ ఫ్యాన్స్ కు దొరికేసింది స్టార్ హీరోయిన్ సమంత. 


1 నేనొక్కడినే టైంలో మహేష్ కాళ్లను హీరోయిన్ ముట్టుకునే సీన్ లో ఆడవాళ్లంటే చిన్నచూపెందుకు అని భారీ డైలాగులే కొట్టింది సామ్. అప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారనుకోండి. ఇక రెండు రోజుల నుండి ఎక్కడ చూసిన హాట్ న్యూస్ గా నిలిచిన చలపతి బాబాయ్ కామెంట్స్ పై ఇప్పుడు సమంతను ఆడేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. 


నాగ చైతన్య హీరోగా వస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ లోనే అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ డైలాగ్ వదిలారు. అప్పుడే సమంతను అదేంటి మీక్కాబోయే భర్త ఇలా అంటున్నాడని ఆమెపై ప్రశ్నలు సంధించారు. కాని అది నా గురించి కాదు మిగతా వారి గురించని తప్పించుకుంది సమంత.


కాని చలపతి రావు అన్న మాటలకు రియాక్ట్ అవకపోయే సరికి మహేష్ ఫ్యాన్స్ సమంత మీద పగ తీర్చుకుంటున్నారు. ఏమ్మా సమంత చలపతి అన్న మాటలు నీకు వినపడలేదా లేకపోతే కాబోయే భర్త సినిమా ఫంక్షన్ కాబట్టి సైలెంట్ గా ఉన్నావా అంటూ ట్విట్టర్ లో ఎటాక్ చేస్తున్నారు. మరి సమంత వీటిపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అన్నది ఒకరు బలవుతుంది ఒకరు మధ్యలో సమంత ఏం చేస్తుంది చెప్పండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: