స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇటీవలే విడుదల అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.


కెరియర్ లో మొదటిసారి ఈ సినిమా కోసం బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. పాత్ర పోశించడమే కాదు సినిమా చేస్తున్నాళ్లు బ్రాహ్మణుడిగా మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉన్నాడట. కేవలం సినిమాలోనే కదా అని లైట్ తీసుకోకుండా సినిమా షూటింగ్ ఉన్నంత కాలం కేవలం శాఖాహారంతో తన భోజన కార్యక్రమాలు నడిపించాడట అల్లు అర్జున్.


బన్ని డెడికేషన్ కు హీరోయిన్ పూజా హెగ్దెతో పాటుగా డైరక్టర్ హరీష్ శంకర్ కూడా షాక్ అయ్యాడట. సినిమా స్టార్ హీరోలు ఎంతగా తపన పడుతున్నారు అన్నది ఈ ఒక్క సందర్భంలో తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ కొట్టిన బన్ని మళ్లీ అదే హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. 


డిజె కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి బన్ని కెరియర్ లో మళ్లీ ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. త్వరలో ప్రీ రిలీజ్ కార్యక్రమం జరుపుకోనున్న ఈ మూవీ జూన్ 23న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: