స్వీటీ అనుష్క సౌత్ సినిమాల్లో ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ధ కాలంగా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్ గా చెలామని అవుతున్న అనుష్క బాలీవుడ్ ఆడియెన్స్ కు కొత్తనే చెప్పాలి. బాహుబలిలో దేవసేనగా అలరించిన ఈ అమ్మడు మొదటి పార్ట్ లో ఓల్డ్ గెటప్ కాబట్టి సరిగా గుర్తించలేదు.


కాని కన్ క్లూజన్ లో మాత్రం ఆమె అందానికి ఫిదా అయ్యారు బీ టౌన్ ఆడియెన్స్. దేవసేనగా అచ్చమైన యువరాణిగా అనుష్క అందాలు అదరహో అనిపించాయి. ఆ పాత్రకు తగ్గ గ్లామర్ పడిస్తూ అనుష్క హాఫ్ సారీస్ లో కనిపించినా అందరి కళ్లు తన మీద పడేలా చేసుకుంది. 


ఇక అప్పటి నుండి ఆమె ఇదవరకు నటించిన సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టారు హింది ఆడియెన్స్. అమ్మడు బికినితో పాటుగా స్కిన్ షో చేసిన పిక్స్ ఇప్పుడు గూగుల్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ రేంజ్ లో అందాలను గుమ్మరించిన అనుష్కను దేవసేనగా రాజమౌళి చాలా తక్కువగా చూపించారని వారి వాదన.


చూస్తుంటే త్వరలోనే ఆమెకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినా రావొచ్చని అంటున్నారు. తెలుగులో సూపర్ స్టార్డం తెచ్చుకున్న అనుష్క కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టే టైంలో బాలీవుడ్ అవకాశాలొస్తే ఏం చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: