సూపర్ స్టార్ రజినికాంత్ పా.రంజిత్ డైరక్షన్ లో వస్తున్న మరో మూవీ 'కాలా'. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ కబాలి సినిమా వచ్చింది. అయితే అది అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుకపడింది. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అందరి అంచనాలకు తగ్గట్టు ఉండేలా చూస్తున్నారట. 


ప్రస్తుతం 2.0 సినిమాలో నటిస్తున్న రజిని వచ్చే నెల నుండి రంజిత్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ గా కాలా అని పెట్టారు. ఇక టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే సినిమాను రజిని అల్లుడు కోలీవుడ్ సూపర్ హీరో ధనుష్ నిర్మించడమే.

సూపర్ స్టార్ రజిని 'కాలా'.. అదరగొట్టేశారు..!

కబాలితో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రంజిత్ సినిమాను ఆ రేంజ్ లో నిలబెట్టలేకపోయాడు. కాని ఈ కాలా మాత్రం అలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముంబై మాఫియా డాన్ కథగా రాబోతున్న ఈ కాలా తలైవా ఫ్యాన్స్ ను ఖుషి చేయడం ఖాయమని అంటున్నారు. 


కథ కథనాల్లో రజిని ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని పుష్కలంగా ఉండేలా చూస్తున్న ఈ కాలా మూవీ కచ్చితంగా సంచలనాలను సృష్టించడం ఖాయమనేలా ఉంది. ఈ సినిమాలో రజిని లుక్ మరోసారి సర్ ప్రైజ్ ఇస్తుందట. టైటిల్ పోస్టర్ అయితే అదరగొట్టారు మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: