తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసింది.  ఈ సినిమాతో మెగా అబ్బాయి రాంచరణ్ తేజ కు ఎక్కడ లేని పేరు ప్రతిష్టలు వచ్చాయి. అంతే కాదు గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా పై ఎన్నో ప్రశంసలు వచ్చాయి.  తాజాగా ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కోర్టు మెట్లు ఎక్కాడు.
Image result for magadheera
అసలు విషయానికి వస్తే..తెలుగులో సంచలన విజయం సాధించిన మగధీర చిత్రాన్ని కాపీ కొట్టారని కాబట్టి బాలీవుడ్ చిత్రం '' రాబ్టా '' ని రిలీజ్ కాకుండా నిలిపి వేయాలని అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లో కేసు వేసాడు.  దాంతో కోర్టు జూన్ 1కి కేసుని వాయిదా వేసింది . ఇక రాబ్తా  చిత్రం జూన్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  సాధారణంగా రిమేక్ చిత్రాలు తీయాలంటే ఆ చిత్రం నిర్మాత, దర్శకులను సంప్రదించాల్సి ఉంటుంది.  
Image result for raabta movies
కానీ బాలీవుడ్ నిర్మాతలు మగధీర హక్కులని కొనకుండా ఫ్రీ మేక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూ కోర్టు కెక్కారు అల్లు అరవింద్ . రాబ్తా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మగధీర ని పోలి ఉంది అని చర్చ జరిగింది , ఇక ఇప్పుడేమో సినిమా రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో అది వాస్తవమేమో అని భావించిన అరవింద్ కోర్టు కెక్కాడు . జూన్ 1న కోర్టు ఏం చెబుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది


మరింత సమాచారం తెలుసుకోండి: