ఖైదీ సినిమా తో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన హీరో చిరంజీవి అంతకు ముందు ఉన్న రికార్డులు అన్నీ సవరించి పక్కన పెట్టారు. చిరు స్టామినా మాత్రం తగ్గలేదు అన్న రీతిలో ఇరగ దీసాడు చిరు. ఒక మాస్ మసాలా ఎంటర్టెయినర్ తో 105 కోట్ల రూపాయల షేర్ వసూలు కొత్త చరిత్ర సృష్టించారు చిరు. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 బుల్లితెరపైకి వచ్చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని.. ఈ ఆదివారం నాడు అంటే మే 28న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేస్తోంది మాటీవీ.


మూవీ ఆఫ్ ది డెకేడ్ అంటూ వారం ముుందు నుంచే ప్రచారం చేస్తూ హడావిడి చేస్తోంది.  సమ్మర్ సీజన్ కావడం.. జనాలు బయటకు వెళ్లేందుకు అంతగా ఇష్టపడకపోవడం.. టీవీలకు కట్టేసే ఐపీఎల్ సీజన్ అయిపోవడం.. బాహుబలి2 హంగామా తగ్గిపోవడం.. మరో భారీ చిత్రం ఏదీ రిలీజ్ లేకపోవడం.. ఇలా చాలా అంశాలే ఖైదీకి సహకరించనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: