ఈ ఏడాది సంక్రాంతి రేస్ కు మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదే నెంబర్ 150’ తో పోటీగా విడుదలై బాలకృష్ణ కెరియర్ లో 70 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన తోలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం బాలకృష్ణకు కెరియర్ లో మరిచిపోలేని విజయంగా మారింది. తక్కువ బడ్జెట్ తో ఒక చారిత్రాత్మక సినిమాను నమ్ముకుని క్రిష్ చేసిన సాహసానికి మంచి ఫలితమే దక్కింది.

అయితే ఇప్పడు ఈసినిమా పై ‘బాహుబలి 2’ అఖండ విజయం ప్రభావితం చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘బాహుబలి 2’ సాధించిన ఘన విజయంతో కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల సృష్టి   'గౌతమీపుత్ర శాతకర్ణి' పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ  సినిమా ప్రేక్షకులు భారీ గ్రాఫిక్స్ తో ఉన్న చారిత్రాత్మక జానపద సినిమాల వైపు ఆకర్షిత మవుతున్న నేపధ్యంలో  ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తమిళ అనువాద హక్కుల్నిఒక ప్రముఖ తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ రేటు ఇచ్చి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
 

ఇప్పటికే  ఈ సినిమా ప్రాజెక్ట్ కు సంబంధించి అనువాద కార్యక్రమాలు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా 200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'బాహుబలి' రెండు భాగాలూ తమిళనాట అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టడంతో ఇదే కోవలో చారిత్రక కథాంశంతో తెరకెక్కిన 'శాతకర్ణి' సైతం తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తుందని అక్కడి తమిళ సినిమా బిజినెస్ వర్గాలు ఆశిస్తున్నట్లు టాక్. 

ఇప్పటికే గతంలో బాలయ్య సినిమాలు కొన్ని తమిళంలోకి అనువాదం అయిన నేపధ్యంతో పాటు ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయం కావడం మరో ప్లస్ పాయింట్ గా భావిస్తున్నట్లు టాక్.  దీనికితోడు ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గదే కావడంతో రిజల్ట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. 

అయితే శాతకర్ణిని తెలుగు చక్రవర్తి అయినప్పటికీ అతడి చరిత్ర ప్రకారం అతడిసామ్రాజ్యం తమిళనాడు వరకు విస్తరించడంతో ఈ కధకు తమిళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు అన్న నమ్మకం తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్క్స్ కు ఉంది అని టాక్.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: