స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ ప్లాన్ కు క్రేజీ బ్యూటీ శ్రుతి హసన్ దెబ్బ కొట్టింది. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రుతి, యూరప్ లో బన్నీ తో కలిపి ‘రేసు గుర్రం’ స్వారి చేద్దామని వెళ్ళింది. తీరా యూరప్ లో కాలుపెట్టాక తనకు షూటింగ్ అంటే భయమేస్తోంది అంటూ ఖంగారుపడిపోతోంది అట. యూరప్ వాతావరణం శ్రుతి హసన్ కు పడకపోవడంతో ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చి౦ది. ఏదో విధంగా షూటింగ్ కు అంతరాయం కలగకుండా నటిద్దామని ఆమె ఎంత ప్రయత్నించినా ఆమె శరీరం దానికి సహకరించడం లేదట.

ప్రస్తుతం యూరప్ లో ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్స్ కూడా కొన్ని రోజుల వరకు ఆమె చలి ప్రదేశాలో షూటింగ్ కు రాలేదని చెప్పడంతో చేసేది లేక యూనిట్ సభ్యులు అంతా తమ హోటల్ రూమ్స్ కే పరిమితం అయి పోతున్నారట. యూరప్ కు వెళ్ళింది శ్రుతి, బన్నీ ల మధ్య యుగాల గీతాల చిత్రీకరణకు కాబట్టి శ్రుతి హసన్ లేకుండా వేరే చిత్రీకరించే సన్నివేశాలు కూడా ఏమి లేవని దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చెప్పడంతో ఇక చేసేది లేక ప్యాకాప్ చెప్పేసి ఇండియా తిరిగివెళ్ళిపోతామనే ఉద్దేశంలో ఫిలిం యూనిట్ ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా శ్రుతి అనారోగ్యం బన్నీ షూటింగ్ కు దెబ్బ కొట్టడమే కాకుండా అల్లు అర్జున్ రేసు గుర్రం యాక్షన్ ప్లాన్ కు షాక్ ఇచ్చిందని అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: