బాలీవుడ్ నుండి హాలీవుడ్ ట్రాన్స్ ఫర్ అయిన ప్రియాంకా చోప్రా క్వాంటికో సీరీస్ లో రెచ్చిపోయి మరి నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఇక బేవాచ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందులో కూడా మంచి మార్కులే కొట్టేసిందని తెలుస్తుంది. బేవాచ్ లో ప్రియాంకా బికిని ప్రదర్శన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందట.


ఇక ప్రమోషన్స్ లో బీచ్ లన్ని తిరిగి మరి బికినిలతో సినిమాను ప్రమోట్ చేసిన టీం ఇప్పుడు ప్రీమియర్ షోలోనే ప్రియాంకాను చూసి మెచ్చుకుంటున్నారట. తన హాలీవుడ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఉండాలని ఊహించిందో అంతకు తెగించి బికినిలతో ప్రమోషన్స్ తో విచ్చలవిడి అందాల ప్రదర్శన చేసింది ప్రియాంకా.


టార్గెట్ ఒక్కటే హాలీవుడ్ లో ఆమె స్థానం సంపాదించడం.. చూస్తుంటే పిసి అనుకున్న టార్గెట్ ఫుల్ ఫిల్ చేసినట్టే ఉంది. ఇప్పటిదాకా ప్రియాంకాను చూడనంత హాటీగా బేవాచ్ లో చూపించారట. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియాంకా వేసుకున్న బికిని పిక్స్ ఇండియన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి.


అందుకే సోషల్ మీడియాలో ప్రియాంకా బికిని పిక్స్ తెగ హల్ చల్ చేశాయి. ఏది ఏమైనా సరే తన హాలీవుడ్ సినిమా నిలబెట్టే క్రమంలో ప్రియాంకా చేసిన అన్ని మ్యాజిక్కులు పనిచేశాయి. దీపికా పదుకునేలా కాకుండా హాలీవుడ్ లో ప్రియాంకా హవా కొనసాగించేలానే ఉంది. అమ్మడు రెచ్చిపోవడం చూస్తుంటే హాలీవుడ్ నీళ్లు బాగానే పడినట్టు ఉన్నాయనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: