యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్న మొన్నటి వరకు తెలుగు హీరో మాత్రమే. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ గ్రాఫ్ ఒక్కసారిగా నింగినంటింది. ఆయన ఖ్యాతి ప్రాంతీయ స్థాయి నుంది ఒక్కసారిగా దేశ స్థాయిని అధిగమించి అంతర్జాతీయ స్థాయికి అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ కాబట్టి ఇక నుండి ప్రభాస్ నటించిన ప్రతీ సినిమా తెలుగుతో పాటు దేశం లోని అనేక ఇతర భాషలలోకి కూడా అనువాదం అవుతుంది. ముఖ్యం గా హిందీ అంటే బాలీవుడ్ లో కూడా విడుదల అవుతుంది

Image result for prabhas images

బాలీవుడ్ సినిమాలకు తన స్వంత స్వరం అందించేందుకే హిందీపై పట్టుసాధించే ప్రయత్నంలో ఉన్నారు ప్రభాస్.

తనకొత్త చిత్రం "సాహో" ని హిందీలో కూడా విడుదల చేయనున్నారు, కాబట్టి ఆ చిత్రానికి ప్రభాస్ తొలిసారిగా తన డబ్బింగ్ ని తానే స్వంతంగా చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతుంది. మెరుగైన హిందీ కోసం భారీ డైలాగ్స్ డెలివరి కోసం నిసితంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రభాస్ . "సాహో" సినిమా జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ భారీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇక "సాహో" కూడా అద్భుత విజయం సాధించ గలదని నమ్ముతున్నారు. కేవలం భారీ బడ్జెట్ మాత్రమే కాదు జగద్విఖ్యత నటుడు ప్రభాస్ కథానాయకుడు.

Image result for prabhas learning hindi

మరింత సమాచారం తెలుసుకోండి: