తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ప్రస్తుతం రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 2.0 మూవీలో నటించారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఇప్పుడు రజనీకాంత్ మరో మూవీకి రంగం సిద్ధం చేసుకున్నారు. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్  ఈ సినిమా చేయనున్నారు.

ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. రజిని కొత్త చిత్రం టైటిల్ ‘కాలా’.   ఈ మూవీకి సంబంధించిన లోగోని తాజాగా విడుదల చేసారు. అయితే ఈ మూవీ ఇప్పుడు రజనీకాంత్ ఫిల్మ్ కెరీర్ కి, పొలిటికల్ కెరీర్  కి కీలకం కానుంది. కాల మూవీలో రజనీకాంత్ పొలిటికల్ లీడర్స్ అరాచకాలను చూపించనున్నాడు. ఇప్పటికే రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తాను అన్నట్టుగా సంకేతాలను పంపారు.

అలాగే దీనికి సంబంధించిన చర్ఛలను ఇంకా అభిమానులతో ప్రత్యేకంగా చర్చిస్తూనే ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావమా? లేక మరో రాజకీయ పార్టీ కి అధినాయకుడిగానా? అనేది ఇంకా తెలియాల్సింది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ కంటే మరో యాక్టర్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి కావాలనే ఆశయాలను పెట్టుకున్నవారు ఉన్నారు.

తనే ఇలయదళపతి విజయ్. విజయ్ ఎప్పటి నుండో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. కానీ తాజాగా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రి ఇస్తుండటంతో తనపై కాస్త నెగిటివ్ కామెంట్స్ ని స్టార్ట్ చేస్తున్నారంట. ఇది గమనించిన రజనీ వర్గం...రజీకాంత్ కి ఉన్న విషయం చెప్పుకొచ్చింది. దీనికి రజినీకాంత్ కోపాన్ని తెచ్చుకొని...విజయ్ కి డైరెక్ట్ గానే క్లాస్ పీకాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: