తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేశావే చిత్రంతో మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మళియాళ భామ సమంత.  తర్వాత తెలుగు, తమిళ అగ్ర హీరోల సరసన నటించి బిజీ హిరోయిన్ గా మారిపోయింది.  ఏం మాయ చేశావే చిత్రంలో నటించిన సహ నటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  అయితే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది..త్వరలో పెళ్లి బాజా కూడా మోగనుంది.  ఈ లోగా సమంత కమిట్  అయిన సినిమాలన్నీ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  

ఇక అక్కినేని ఇంటి కోడలు అవుతున్న సందర్భంగా సమంత చాలా ఫంక్షన్లలో చిర కట్టుతోనే కనిపిస్తుంది. అంతే కాదు తెలంగాణ చేనేత అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.  గతంలో సమంత గ్లామర్ రోల్స్ లో హాట్ హాట్ గా నటించేది.  కొంత కాలంగా గ్లామర్ కి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చింది.  ఎప్పుడైతే చైతూ తో ప్రేమ వ్యవహారం నడిపించిందో అలాంటి పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పిందని అంటున్నారు.  ప్రస్తుతం సమంత, చైతూ సహజీవనం చేస్తున్నారని టాక్.   ఈ అమ్మడు మరోసారి పెను సంచలనాలు సృష్టించింది..అది కూడా మునుపెన్నడూ కనిపించనంత హాట్ గా ఓ ఫోటో షూట్ బయట పెట్టింది.
Related image
తాజాగా సమంత ఓ మేగజైన్‌కి కవర్ పేజీకి ఇచ్చిన ఫోటోషూట్ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మరింత హాట్‌గా కనిపించింది. ఈ విధంగా ఎప్పుడు ఫోజులివ్వలేదని అంటున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్. ఈ షూట్‌కి సామ్‌కి భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం.  త్వరలో మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వానుకుంటున్న సమంత దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా ఫోటోషూట్ బిజీ అయ్యిందనుకుంటున్నారు. ఇలా ఎవరికివాళ్లు తమతమ ఒపీనియన్‌ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: