తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా విజయాలు సాధించకపోయినా..దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  ఇక మిర్చి, డార్లింగ్ లాంటి సినిమాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాయి.  ఒక తెలుగు సినిమా జాతీయ చిత్రంగా అన్ని భాషల్లో దుమ్మురేపుతుంది.  
Related image
ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపు 1600 వందల కోట్లు కలెక్షన్లు వసూళ్లు చేసినట్లు టాక్.  అయితే బాహుబలి సిరీస్ పూర్తి అయ్యే వరకు ప్రభాస్ ఏ ఇతర సినిమాలు చేయలేదు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి పేరు రావడంతో ఆయనతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇక ప్రభాస్ రేంజ్ బాగా పెరగడంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి ప్రభాస్  ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడో అని అందరూ ఆశ్చర్యపోయారు.  
Image result for saaho movie stills
ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు ప్రభాస్ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట..అంతే కాదు ఎంత కావాలో చెప్పమని నిర్మాతలు అడిగినా వద్దనేశాడు. ఈ మద్య అగ్ర హీరోలు రెమ్యూనరేషన్ కి బదులు  లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.  ఇదే ట్రెండ్ ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్. బాహుబలి-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ కచ్చితంగా తన పారితోషికం పెంచుతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం పారితోషికం పెంచలేదు. నిర్మాతలు తన బంధువులు, స్నేహితులే కావడంతో, వాళ్లను ఎక్కువ డిమాండ్ చేయడం లేదట.
Image result for saaho movie stills
యూవీ క్రియేషన్స్ నిర్మాతలే ప్రభాస్ కు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. బయట హీరోలకు ఇచ్చినట్టు పారితోషికం కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పడం, దానికి ప్రభాస్ ఓకే అనేయడం జరిగిపోయాయట.దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వస్తోంది సాహో సినిమా. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పుడు ప్రభాస్ జాతీయ స్థాయి నటుడు కనుక ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే వేసుకుంటున్నారట. సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు. ముంబయితో పాటు దుబాయ్, యూరోప్ దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: