ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స‌క్సెస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం అత్తారింటికీ దారేదీ. ఇటు ఇండ‌స్ట్రీ, అటు అభిమానుల్లో బారీ అంచ‌నాలు వున్న ఈ సినిమా టైటిల్ బుద‌వారం ఫైన‌ల్  అయిన సంగ‌తి తెలిసిందే.  ప్రస్తుతం అన్నపూర్ణ  స్టూడియో లో ఇట్స్ టైం టు పార్టీ అనే  లాస్ట్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతోంది. స‌మంత‌, ప్రణీత, హంసానందిని , ఖుషీ ఫేమ్ ముంతాజ్ ల‌తో పాటు దాదాపు వంద మంది డాన్సర్స్ ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గోంటున్నారు.
��
విశేషం ఏంటంటే ఈ పాట‌లో ప‌వ‌ర్ స్టార్ కాసేపు అత్తాపూర్ బాబాగా కనిపిస్తాడ‌ట‌. దీనికి సంబందించిన స్టిల్స్ కూడా ఇపుడు నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గుండుబా శంక‌ర్ లో  స్వామిజీ గెట‌ప్ లో ప‌వ‌న్ భీభ‌త్సంగా కామెడీ పండించాడు. ఇపుడు  అత్తారింటికీ దారేదీలోనూ బాబాగా క‌నిపించి క‌డుపుబ్బ న‌వ్విస్తాడ‌ని మూవీ యూనిట్ అంటోంది. మ‌రి అత్తాపూర్ బాబా అత్తారింట్లో ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలియాలంటే
ఆగస్టు7దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అత్తారింటికీ దారేదీ రిలీజ్ ఆ రోజే మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: