ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాల హవా కొనసాగుతుంది.  ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాాగా పోటీ పడుతున్నాయి.  కొత్త దర్శక, నిర్మాతలు, నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  మంచి కథ అయితే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనడానికి గత సంవత్సరం రిలీజ్ అయిన పెళ్లిచూపులు..ఈ సంవత్సరం రిలీజ్ అయిన వెంకటాపురం,కేశవ లే రుజువు.  అయితే ఈ మద్య సినిమా టైటిల్స్ కూడా చాలా ఫన్నీగా పెట్టడం జరుగుతుంది.

Displaying WhatsApp Image 2017-05-27 at 16.15.47.jpeg

తాజాగా  రెండు జంట‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ల్లో అస‌లు సిస‌లు స‌రిగ‌మ‌లేంటో వెండితెర‌పై చూడాలంటున్నారు నిర్మాత కాక‌ర్ల నాగ‌మ‌ణి. కాక‌ర్ల రాహుల్‌, శ్వేత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ కోట శ‌క్తి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కత్వంలో కాక‌ర్ల నాగ‌మ‌ణి నిర్మించిన చిత్రం `వెక్కిరింత‌`. కాక‌ర్ల‌, నాని(శ్రీధ‌ర్‌), వినీత్‌, ప్రేయ‌సి నాయ‌క్‌, మౌనిక రెడ్డి ప్ర‌ధాన తారాగ‌ణం. చంద్ర‌లేఖ‌, భానుప్ర‌సాద్‌.జె సంగీతం అందించారు.  వెక్కిరింత టైటిల్ కి త‌గ్గ‌ట్టే విభిన్న‌మైన చిత్రం.

Displaying WhatsApp Image 2017-05-27 at 16.15.28.jpeg

ఈ ఏడాది చిన్న చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ బావుంది. ఆ కోవ‌లోనే పెద్ద విజ‌యం సాధించే చిత్ర‌మిద‌ని నిర్మాత అన్నారు. సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. ఇద్ద‌ర‌మ్మాయిలు.. ముగ్గుర‌బ్బాయిలు.. రెండు ప్రేమ‌క‌థ‌లు .. ఇదే మా సినిమాలోని అస‌లు ట్విస్ట్‌. మంచి మ్యూజిక్ కుదిరింది. జూన్ 2న‌ ఈ సినిమాని థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. ఈ చిత్రానికి , సాహిత్యం: మ‌నాశ్రీ, ఎస్‌.కె.షాహి, ఎడిట‌ర్ః నాగార్జున‌.ఎం, సంగీతం: చంద్ర‌లేఖ‌, కెమెరాః వాసిరెడ్డి స‌త్యానంద్‌, భానుప్ర‌సాద్‌.జె, డైలాగ్స్: సాయి రామ‌కృష్ణ‌, నిర్మాత: కాక‌ర్ల నాగ‌మ‌ణి, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: జంగాల నాగ‌బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: