తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చి ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోగా మారాడు రాజ్ తరుణ్.  అయితే ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు.  అదృష్టం కలిసి వచ్చి మనోడు నటించిన చిత్రాలు వరుసగా హిట్ కావడంతో ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగామారిపోయాడు. తాాజాగా రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం,కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`.  


ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తైన ఈ సినిమా జూన్ 2న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.  సెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు  సోష‌ల్ మీడియాలో ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా మంచి అంచ‌నాలు నెకల‌కొన్నాయి. హిలేరియ‌ స్ట్రైల‌ర్‌గా యాక్ష‌న్‌, థ్రిల్‌, రొమాన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ పెద్ద హిట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 


రాజ్‌త‌రుణ్‌తో పాటు స‌త్య‌, సుద‌ర్శ‌న్‌లు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నారు. కామెడి, థ్రిల్లింగ్‌, స‌స్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌,రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌పీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికికెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతఃరామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: