తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడా రాడా... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వంటి ఆసక్తికరమైన క్వశ్చనే ఇది. కానీ కొంతకాలంగా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అందులోనూ జయలలిత హఠాన్మరణం తర్వాత ఈ ప్రశ్న ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయింది. తమిళనాట అత్యంత ఆదరణ ఉన్న నటుడు రజినీయే కదా మరి.

ఇటీవల రజినీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పుడు రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ చేయలేదు. ఐతే.. ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు. జులైలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ 
ప్రకటించేశారు.

Image result for RAJANIKANTH KAALA

జులై నెలాఖరులో ఆయన రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు బెంగళూరులో గైక్వాడ్  వెల్లడించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్నది ప్రజలు, అభిమానుల కోరిక అని 
గైక్వాడ్  అంటున్నారు. అందుకే రజనీ శ్రేయోభిలాషులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఈ సంప్రదింపులు తొలిదశ ముగిసిందని.. ఇవి మళ్లీ కొనసాగుతాయని గైక్వాడ్ వివరించారు. 

రజినీ తాజా చిత్రం.. కాలా షూటింగ్ కోసం అభిమానులను కలుసుకోవడాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారట. మళ్లీ జులైలో అభిమానులతో మరోసారి మాట్లాడి పార్టీ పెట్టేస్తారట రజినీకాంత్. ఐతే.. రజినీ నాన్చుడు ధోరణి రాజకీయాలకు సరిపోతుందా లేదా అన్నది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మరి రజినీ భవితవ్యం ఎలా ఉందో..?



మరింత సమాచారం తెలుసుకోండి: