నారా వారి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన రోహిత్ రెగ్యులర్ సినిమాలను కాకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ముందుండే రోహిత్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. రోహిత్ తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాదినేని మరోసారి రోహిత్ కు అదిరిపోయే లైన్ చెప్పాడట.


ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి సావిత్రి సినిమా తీశారు. అయితే రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒక మనసు సినిమాలో నటించిన నిహారికా కొద్ది పాటి గ్యాప్ తీసుకుని మరో సినిమా చేస్తుంది.


ఇప్పటికే తమిళంలో ఓ డెబ్యూ మూవీ ఓకే చేసిన నిహారిక ఇప్పుడు తెలుగులో తన సెకండ్ మూవీ ప్లాన్ చేస్తుంది. పవన్ ఆఫర్ కు కాస్త టైం కావాలని అన్నదట నిహారిక. నారా హీరోతో మెగా హీరోయిన్ ఈ కాంబినేషన్ సూపర్ క్రేజ్ సంపాదిస్తుంది. మరి అనుకున్నట్టుగా రోహిత్ కు నిహారిక ఓకె చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


ఒక మనసు ఫ్లాప్ తర్వాత నిహారిక తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పవన్ సాదినేని డైరక్షన్ టాలెంట్ తెలుసు కనుక కచ్చితంగా నిహారిక ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పే అవకాశాలే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: