తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ తమన్నారు.  తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తీసుకు రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడా ఫెయిల్ కావడంతో దక్షిణాది బెస్ట్ అనుకొని ఇక్కేడే నటిస్తుంది.  అంతే కాదు గత కొంత కాలంగా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తున్న తమన్నాకు ‘బాహుబలి’ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. బాహుబలి మొదటి పార్ట్ లో ఈ అమ్మడు అప్సరసలా కనిపించి అదరగొట్టింది.
Image result for tamanna school dress
కాకపోతే సెకండ్ పార్ట్ లో మాత్రం మెరుపుతీగలా కనిపించి వెళ్లిపోయింది.  తాజాగా ఈ అమ్మడు యంగ్ హీరో సందీప్ కిషన్ తో కలసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లికి ఇది మొదటి తెలుగు సినిమా అవడం గమనార్హం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలైంది.  తమన్నా ఓ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది..ఆ ఫోటో చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫోటోలలో తమన్నా స్కూల్ యూనిఫాం లో కనిపించి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
Image result for tamanna baahubali
మిల్కీ బ్యూటీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆమె క్యూట్ గానే ఉంటుంది.   నిజంగా ఈ అమ్మడు తమన్నానేనా లేకా స్కూల్ అమ్మాయా అనుకుంటున్నారు.  ఈ విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. సచిన్ జోషి, పూరి అక్షయ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో డబ్ విడుదల చేస్తున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: