ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో కూడుకున్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది.  ముని సినిమాతో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పాలి.  గతంలో విఠలాచార్యులు తీసిన సినిమాలో భయపెడూనే మంచి కామెడీ పండించే వారు.  తర్వాత రాంగోపాల్ వర్మ చిత్రాలు పూర్తిగా భయపెట్టే విధంగా ఉండేవి.  లారెన్స్ ముని, కాంచన, గంగ లాంటి చిత్రాలు ఓ వైపు కడుపుబ్బా నవ్విస్తూనే భయపెడుతూ వచ్చాయి.  తాజాగా ఇదే కాన్సెప్ట్ నమ్ముకొని వస్తున్నారు హీరో శ్రీకాంత్.
Image result
 తన తోటి మీడియం రేంజ్ హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నా...శ్రీకాంత్ మాత్రం ఇంకా హీరో గా నటిస్తున్నారు.  అప్పుడప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా సరే టెర్రర్ వంటి కంటెంట్ ఉన్న సినిమా కూడా శ్రీకాంత్ కు మార్కెట్ లేకపోవడం వలన అన్యాయం అయ్యింది. అంతే కాదు శ్రీకాంత్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. తాజాగా  రారా అనే మరో సినిమా చేశాడు శ్రీకాంత్.  ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఏకంగా కేరళా వెళ్లి అక్కడ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని కలిసి ‘రారా’ టీజర్ రిలీజ్ చేయించారు.
Image result for srikanth raa raa movie stills
ఈ కార్యక్రమంలో  ఊహ , చిత్ర దర్శకనిర్మతలు పాల్గొన్నారు.   తన సినిమాలని జనం పట్టించుకోవడం లేదని గమనించి రారా కోసం ప్రమోషన్ కొంచెం భిన్నంగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకాంత్. తాజాగా  ఈ వీడియో జనాలను బాగానే  ఆకర్షిస్తుంది.  ఇప్పటికే చూసిన నెటిజన్లు శ్రీకాంత్ ఓ వైపు నవ్విస్తూనే..భయపెడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.  

శ్రీకాంత్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: