సుందర్.సి దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో టాప్ టెక్నీషియన్లతో వస్తున్న ప్రతిష్ఠా త్మ కంగా నిర్మాణమౌతున్న "సంఘమిత్ర ప్రాజెక్టు" నుంచి అందాల భామ హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకొన్నట్లు విశ్వసనీయం గా తెలుస్తోంది. ఈ సినిమాలో నటించటానికి అవకాశం లభించటం అంటే సాధారణ విషయం కాదు. తమిళ దర్శకుడు సుందర్.సి తెలుగు,తమిళ,హిందీ భాషల్లో సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో "శ్రుతి ఫస్ట్ లుక్" ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్" లో చాలా ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేశారు.
ఈ సోషియో ఫాంటసీ డ్రామాలలో ఇప్పటికే నటించిన శ్రుతి హసన్ అలాంటి సినిమాల్లో నటించి కూడా చాలా కాలమై పోయింది. ఇన్నాళ్లూ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో శ్రుతి చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది ఒక మంచి అవకాశమని, వారియర్ ప్రిన్సెస్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని, టైటిల్ రోల్‌కు శ్రుతి అయితేనే పెర్ఫెక్ట్ ఫిట్ గా భావించిన యూనిట్ ఎంతో ఆనందం గా ఉంది.
ఈ సినిమాకు అమెంతో వైభవం అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, ఆ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. దాంతో ఏమీ చేయలేని చిత్ర యూనిట్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడిందట.
ఈ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారు? ‘‘పూర్తి బౌండ్ స్క్రిప్ట్ అందజేయకపోవడం, షూటింగ్ షెడ్యూల్స్ గురించి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడంవల్లే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని ఆమె వ్యక్తిగత సిబ్బంది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతీహాసన్‌తో ‘సంఘమిత్ర’ చేయలేకపోతున్నాం’’ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్ ఫిల్మ్స్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి లండన్‌లో యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అదంతా వేస్ట్ అయిందనుకోడానికి లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె ఇలాంటి సినిమా చేస్తే ఉపయోగపడుతుంది కదా.