అంతా నటనే అయినా బుల్లితెరకూ.. పెద్ద తెరకూ చాలా తేడాలున్నాయి. పెద్ద తెరపై బంపర్ హిట్లు కొట్టిన ఎందరో బుల్లి తెరపై అంతగా తమ ప్రభావం చూపించలేకపోయారు. అందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ ఉదాహరణ.. ఆయన నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో అనుకున్నంతగా రక్తి కట్టలేదు. ఫ్లాప్ షోగా పేరు తెచ్చేసుకుంది. 

chiru meelo evaru koteeswarudu కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బుల్లితెరపై కనిపించబోతున్నారు. ఇన్నాళ్లు తన నటన, నృత్యాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెర యాంకర్ గా కనిపించబోతున్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆ షోను దక్షిణాదిన నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు.

ntr on tv screen కోసం చిత్ర ఫలితం

తెలుగులో యాంకరింగ్ కోసం వారు ఎన్టీఆర్ ను సంప్రదించారు. అందుకు ఎన్టీఆర్ అంగీకరించారు. బుల్లి తెరపై ఇప్పటికే నాగార్జున హిట్ కొట్టారు. ఆయన నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు బాగా హిట్ అయ్యింది. మరి జూనియర్ కూడా అదే సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేస్తే బుల్లితెరపైనా అలరించవచ్చు.. అలా చేయలేకపోతే మాత్రం క్రేజ్ తగ్గిపోవడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: