సంఘ‌మిత్ర టీమ్ నుంచి శ్రుతిహాస‌న్ త‌ప్పుకోవ‌డం వెనుక పెద్ద త‌తంగ‌మే న‌డించింద‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. సంఘ‌మిత్ర లో శ్రుతి న‌టించ‌డం లేదు.. వేర్వేరు కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ సినిమా వ‌దులుకొంది.. అంటూ శ్రుతిహాస‌న్ పీఆర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ సినిమా కోసం గ‌త కొన్ని రోజులుగా శ్రుతి బాగా క‌ష్ట‌ప‌డుతోంది. క‌త్తి యుద్దాలు, గుర్ర‌పు స్వారీ నేర్చుకొంటోంది. త‌న కెరీర్‌లో ఓ విభిన్న‌మైన పాత్ర వ‌చ్చినందుకు మురిసిపోయింది. ఇంత‌లోనే ఏమైంది? ఈ సినిమా ఎందుకు వ‌దులుకొంది? అని ఆరా తీస్తే, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి.


ఈ సినిమా నుంచి శ్రుతి త‌ప్పుకోలేద‌ట‌.. శ్రుతిని త‌ప్పించార్ట‌. శ్రుతి కంటే బెట‌ర్ ఆప్ష‌న్ సంఘ‌మిత్ర టీమ్‌కి దొరికింద‌ని, అందుకే శ్రుతికి మొండి చేయి చూపించార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కూ, శ్రుతికీ మ‌ధ్య ఏవో క‌మ్యునికేష‌న్ గ్యాప్ ఉంద‌ని… అదే కొన‌సాగితే ఆ ఎఫెక్ట్ సినిమాపై ప‌డుతుంద‌ని చిత్ర‌బృందం భ‌య‌ప‌డింద‌ని, దాంతో శ్రుతిని త‌ప్పించాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది.


చిత్ర‌బృందం ఈ విష‌యం ప్ర‌క‌టించ‌క‌ముందే… శ్రుతి మేల్కొని, తొలి అడుగు తాను వేసేసింది. దాంతో బిజీ షెడ్యూల్ వ‌ల్ల సంఘ‌మిత్ర‌కు కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌ట్లేదు.. అనే సంకేతాలు పంపిన‌ట్టైంది. శ్రుతి స్థానంలో ఓ బాలీవుడ్ క‌థానాయిక‌ని ఎంపిక చేయాల‌ని ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సి భావిస్తున్నాడ‌ట‌. ఆ ఛాన్స్ ఎవ‌రికి వ‌స్తుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: