మెగాస్టార్ పదేళ్ల తర్వాత వచ్చిన మూవీ ఖైది నంబర్ 150. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. 100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది. లాస్ట్ సండే స్టార్ మాలో ప్లే అయిన ఖైది నంబర్ 150 మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.


అంతేకాదు పోటీగా ఓ చానెల్ లో ఐఫా అవార్డ్ మరో ఛానెల్ బాహుబలి రాజమౌళి ఇంటర్వ్యూ పెట్టినా సరే అందరు ఖైది నంబర్ 150నే చూశారు. టి.ఆ.పి రేటింగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చిందని తెలుస్తుంది. తమిళ కత్తి సినిమా రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150 మూవీ మెగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. నాన్ బాహుబలి రికార్డులన్ని చెరిపేసి మరోసారి చిరు సత్తా ఏంటో చూపించింది.


స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ రేంజ్ లో క్రేజ్ ఉండటం చూస్తుంటే మెగాస్టార్ మళ్లీ తన హవా కొనసాగిస్తున్నట్టే లెక్క. కాజల్ హీరోయిన్ గా నటించిన ఖైది నంబర్ 150 సినిమాలో చిరు నటన మెగా ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. చిరు కెరియర్ లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీగా నిలవడమే కాకుండా పదేళ్ల తర్వాత ఎన్ని హిట్ సినిమాలొచ్చినా మెగాస్టార్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది ఖైది నంబర్ 150.


మరింత సమాచారం తెలుసుకోండి: