సాధారణంగా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు.  ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని మనిషిని పోలిన మనుషులు అక్కడక్కడా కనిపిస్తున్నారు.  కొన్ని పోలికలు ఇద్దరివి కలిసినా..అచ్చు గుద్దినట్లు ఉండటం కష్టం. అయితే కొంత మంది కవలలు మాత్రం చాలా వరకు ముఖాలు అచ్చుగుద్దినట్టు ఉంటాయి.  తాజాగా ఓ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది.
Image result for sridevi childhood
ఇంతకీ ఈ ముద్దుల చిన్నారి అంతగా హల్ చల్ చేయడానికి కారణం ఏంటా అని అనుకుంటున్నారు..! ఆ పాపను చూస్తే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీనీ తన అందచందాలతో ఉర్రూతలూగించిన ‘అతిలోక సుందరి’గా గుర్తించబడిన హీరోయిన్ శ్రీదేవి చిన్నతనం గుర్తుకు వస్తుంది.  ఈ పాప అచ్చం చిన్ననాటి శ్రీదేవి పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది.  తన అందాలు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా అభిమానులను ఆకట్టుకున్న  నటి శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో  ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.  
Related image
నెలల వయసున్న ఈ చిన్నారి అచ్చం‌ ..అచ్చుగుద్దినట్టు.. అతిలోకసుందరి శ్రీదేవిలా వుంది.  కళ్ళు, ముక్కు, టోటల్‌గా శ్రీదేవి మాదిరిగా వున్న ఈ చిన్నారి  వీడియో సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  పాప భయంతో బిక్క మొహం పెట్టిందిగానీ, నవ్వితే ఆ చిన్నారి హావభావాలు మొత్తం శ్రీదేవి చిన్ననాడు ఇలాగే ఉందేమో అనిపించేలా ఉంది. 

Image result for sridevi childhood


మరింత సమాచారం తెలుసుకోండి: