తెలుగు బుల్లితెరపై గతంలో ఫ్యామిలీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ వస్తే కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని లైవ్ షోలు, సీరియల్స్ లో వస్తున్న వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రోత పుట్టించే విధంగా వస్తున్నాయి.   కుటుంబ సమేతంగా చూడాలంటే ఇబ్బంది కలిగేలా ఉంటున్నాయి.  ఇక బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో, పటాస్ ప్రోగ్రామ్స్ పై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్నారు.  ఇందులో వస్తున్న డైలాగ్స్ చూసి యువత చెడుదారులు పట్టే విధంగా ఉన్నాయని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Image result for jabardasth
 రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దం ప్రి రిలీజ్ ఫంక్షన్లో సీనియర్ నటులు చలపతి రావు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది.  ఈ సమయంలో జబర్ధస్త్, పటాస్ కార్యక్రమాలపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  గతంలో జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో కొంత మంది మనోభావాలు దెబ్బ తీశారని వేణుపై దాడి కూడా జరిగింది.  లాయర్లను కించ పరుస్తూ స్కిట్ చేశారని కోర్టుకెక్కారు.  ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముట్టుతున్నా ఈ ప్రోగ్రామ్ నవ్వించేది కనుక కొనసాగుతూనే ఉంది.  
Related image
ఇక పటాస్ విషయానికి వస్తే ఇందులో హోస్ట్ గా వ్యవహరించి రవి, శ్రీముకి కొన్ని సార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని అందులో పాల్గొనే యువత పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.  తాజాగా  జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు, దర్శకులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్.దివాకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు.  దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ, నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: