దాసరి నారాయణరావు.. తెలుగు సినీరంగ దిగ్గజం.. హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ కుదురుకోవడంలో కీలక పాత్ర పోషించిన వాడు. అంతేకాదు.. కుదురుకున్నాక కూడా సినీరంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసినవాడు.. తెలుగు సినీరంగానికి చెందిన అన్నివిభాగాలపై పట్టు ఉన్నవాడు. అందరి తలలో నాలుకలా ఉంటూ తెలుగు సినీరంగానికి ట్రబుల్ షూటర్ గా ఉండేవాడు..

Image result for dasari narayana rao

దాదాపు 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు. దాదాపు 50కి పైగా సొంతంగా సినిమాలు నిర్మించాడు. బుల్లితెర సీరియళ్ల నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టి విజయం సాధించిన వాడు. మరి ఇన్ని సాధించిన దాసరికి తీరని కోరకలు ఏమున్నాయి అనుకుంటున్నారా.. దాసరికి కూడా  తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది.



అదే మహాభారతం చిత్రం. ఆయన మహా భారతాన్ని చిత్రంగా మలచాలని కలలు కన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాను రూపొందించాలనుకున్నారు. అదే తన ఆఖరి చిత్రం అవుతుందని కూడా దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినీరంగం నుంచి ఓ మంచి సక్సస్ తో రిటైర్ అవ్వాలనుకున్నారు. కానీ అది నెరవేరకుండానే సినీపరిశ్రమను దుఖసాగరంలో ముంచి వెళ్లిపోయారు దాసరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: