Image result for bahubali 2 & Dangal


కథలో దమ్ము ఉంటే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అందుకే దాసరి నారాయణరావు కథ, కథనం మాత్రమే నా సినిమాల్లో సూపర్ హీరో అంటారు. అలాగే హీరోల స్టార్‌-డమ్‌ను బట్టి కూడా కొన్ని సందర్బాల్లో  (ప్రతిసారీ కాదు సుమా!)  ఫ్లాప్ సినిమా అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజు వయ్యాయి. 

Image result for bahubali 2 images

ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్లలో సినిమా నిలిచిందన్నదాన్ని బట్టి విజయం లేదా హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ప్రస్తుతం సినిమా ప్రదర్శన తీరు మారింది. వాటి లెక్కలూ మారాయి. విజయం (హిట్) అపజయం (ఫట్) ల నిర్వచనం ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? ఎన్ని రికార్డులను తిరగరాసింది? అన్నదాన్ని బట్టి హిట్టా-ఫట్టా? అన్నది తేల్చేస్తున్నారు.

Image result for bahubali 1 images hd

అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసిన సంఘటనలు కోకొల్లలు. అంటే ఇక్కడ కథ కథానాయకుడైన సందర్భం అన్నమాట. అలా భారత సినీ పరిశ్రమ లో ఇప్పటివరకూ అత్యధిక "కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు" చాలానే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఖాన్ త్రయం (అమీర్‌ ఖాన్, షారూఖ్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌) తోపాటు రజనీకాంత్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను తారుమారు చేయగల సత్తా (రికార్డులను తిరగరాసే) టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి-ది కంక్లూజన్ నిరూపించింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 సినిమాల లిస్ట్ ఏంటో ఓక సారి చూద్దామా?    

Image result for top ten indian movie collection dangal


1. దంగల్- 1662 కోట్ల రూపాయలు (చైనాలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది)
2. బాహుబలి-2 ది కంక్లూజన్ - 1623 కోట్ల రూపాయలు (ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది వసూళ్ళ వేగం తగ్గుముఖం పట్టింది.)
3. పీకే- 792 కోట్ల రూపాయలు
4. బాహుబలి-1 ది బిగినింగ్ : 650 కోట్ల రూపాయలు
5. భజరంగీ భాయీజాన్: 626 కోట్ల రూపాయలు
6. ధూమ్-3: 585 కోట్ల రూపాయలు
7. సుల్తాన్: 584 కోట్ల రూపాయలు
8. కబాలి: 477 కోట్ల రూపాయలు
9. ప్రేమ్ రతన్ దన్ పాయో: 432 కోట్ల రూపాయలు
10. చెన్నై ఎక్స్‌ప్రెస్: 423 కోట్ల రూపాయలు 

Image result for top ten indian movie collection pk

మరింత సమాచారం తెలుసుకోండి: