తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్.  ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన ఆయన ఈ మద్య పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.  తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు కమల్ హాసన్.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకేదేశం ఒకే పన్ను విధానం ఆహ్వానించతగినదే కానీ దీనివల్ల సినిమా రంగం కుదేలు అవడం ఖాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు కమల్ హాసన్.  
Image result for gst tax
జి ఎస్ టి  విధానంపై ఇప్పటికే వ్యాపార సంస్థలు కస్సు బుస్సులాడుతుండగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై ప్రభావం పడుతుందని కమల్ హాసన్ అంటున్నారు. సినిమా రంగంపై 28 శాతం పన్ను వేయడం వల్ల సినిమా పరిశ్రమ మొత్తం రోడ్డున పడుతుందని కాబట్టి తక్షణం 28 శాతం పన్ను ని రద్దు చేయాలనీ , లేకపోతే నేను సినిమాల్లో నటించడం మానేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు కమల్ .
Image result for gst tax
ఆ మద్య మోడీ పెద్ద నోట్ల చలామణి రద్దు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ కుదేలైందని ఇప్పుడు జి ఎస్ టి తో మరింత కుంగి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఒక్క కమల్ హాసన్ మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు 28 శాతం పన్ను ని వ్యతిరేకిస్తున్నారు . మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: