సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ మూవీ తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బయో టెర్రరిజం కథతో రాబోతున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. అసలుసిసలైన సైన్స్ ఫిక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.


సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీఠ వేసినట్టు టీజర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమా మీద అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ సినిమా కోసం నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు డేరింగ్ డెశిషన్ తీసుకున్నాడట. స్పైడర్ నైజాం రైట్స్ ఏకంగా 25 కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడట దిల్ రాజు. 


మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలచిన శ్రీమంతుడు మూవీ నైజాం లో అత్యధికంగా 20 కోట్లు సంపాదించింది. అయితే స్పైడర్ కు దాని కన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చి కొనడం కాస్త షాకింగ్ గానే ఉంది. మురుగదాస్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఈ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎలాగు మంచి ఫాంలో ఉంది ఆమె గ్లామర్ కూడా సినిమాకు ఎంతోకొంత ప్లస్ అవుతుందని అంటున్నారు.


స్పైడర్ పై దిల్ రాజు డెశిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లను దాటేస్తున్న స్పైడర్ మహేష్ కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా పరిశ్రమలో నాన్ బాహుబలి రికార్డులన్ని తిరగరాయడం కన్ ఫాం అంటున్నారు. మరి స్పైడర్ ఎలా ఉంటబోతాడో చూడాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: