ప్రేమకు కులమత భేదాలు లేవంటారు. ఇప్పుడు వయస్సు కూడా అడ్డంకి కాదని ఆ జంట నిరూపించింది. 30 ఏళ్ల హీరోయిన్, 60 ఏళ్ల డైరెక్టర్ పెళ్లి చేసుకుని కోలీవుడ్ లో సంచనలం సృష్టించారు. అది కూడా మీడియా ముందు.. అనూహ్యంగా దండలు మార్చుకుని.. ఉంగరాలు మార్చుకుని దంపతులుగా మారిన వైనం ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది. 



60 ఏళ్ల కోలీవుడ్ డైరెక్టర్ వేలు ప్రభాకర్.. 30 ఏళ్ల హీరోయిన్ షెర్లీదాస్‌ను మీడియా సమక్షంలో పెళ్లాడారు. ఆయన తన తాజా చిత్రం ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ శుక్రవారం విడుదల చేశారు. అందులో ఆయనే హీరో కావడం విశేషం. ఆ కథ కూడా  ఓ దర్శకుడికీ హీరోయిన్ కూ మధ్య నడిచే ప్రేమ కథే. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రివ్యూ వేశారు. 

Image result for oru iyakkunarin kadhal diary

ఈ ప్రివ్యూ వేదికగానే ప్రభాకర్, నటి షెర్లీదాస్ పెళ్లి చేసుకోవడం విశేషం.  షెర్లీ గతంలో ప్రభాకర్ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని ప్రభాకర్ తెలిపారు. ఐతే. ఇలాంటి వయస్సు చాలా తేడా ఉన్న ప్రేమ కథలు నిజజీవితంలో విజయవంతం కావడం మాత్రం అరుదే. మరి ఈ ప్రభాకర్, షెర్లీదాస్ భవితవ్యం ఎలా ఉందో..?



మరింత సమాచారం తెలుసుకోండి: