తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రభాస్.  ఈశ్వర్ చిత్రంలో మాస్ హీరోగా కనిపించిన ప్రభాస్ తర్వాత చత్రపతి, మిర్చి చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో మనోడు ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో మీసం లేకుండా ఎప్పుడూ కనిపించలేదు. తొలిసారి ప్రభాస్ మీసాలు కూడా లేకుండా క్లీన్ షేవ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  

Image result for prabhas saaho

బాహుబ‌లి సినిమా కోసం 4 ఏళ్ళ స‌మ‌యాన్ని కేటాయించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాలో డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించేందుకు ఇటీవ‌ల యూఎస్ వెళ్లి అక్క‌డ నిపుణుల స‌మ‌క్షంలో చాలా బ‌రువు కూడా త‌గ్గిన‌ట్టు తెలుస్తుంది. హెయిర్ స్టైల్ విష‌యంలోను ఈ హీరో కొత్త ద‌నం ట్రై చేస్తున్నట్టు స‌మాచారం. ఈ మ‌ధ్య‌ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. అందులో యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేసాడు.  

Image result for prabhas baahubali 2

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ ఫోటో ఒక‌టి ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది.  క్లీన్ షేవ్ తో స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు ప్ర‌భాస్. స‌డెన్ గా ఆ పిక్ చూస్తే ఇది ప్ర‌భాసేనా అని అనుమానం రాక‌పోదు. మ‌రి టీజ‌ర్ లో ఒక లుక్ తో క‌నిపించిన ప్ర‌భాస్ , రీసెంట్ గా విడుద‌లైన ఓ పిక్ లో మ‌రోలా ఉన్నాడు. ఇక ఇప్పుడైతే క్లీన్ షేవ్ తో డిఫ‌రెంట్ గా ఉన్నాడు. మ‌రి వీటిలో ప్ర‌భాస్ అస్స‌లు లుక్ ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.  మరికొంత మంది మొన్నటి వరకు బాహుబలిగా మీసాలు, గడ్డంతో గంభీరంగా కనిపించిన ప్రభాస్ ఇలా బోడిగా కనిపించడం ఏంటీ అని విమర్శస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: