ఆ మద్య తమిళ ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసిన విషయం ఏంటయ్యా అంటే వెంటనే చెప్పేస్తారు...‘సుచీలీక్స్’.  భారత దేశం మొత్తం ఇది వైరల్ గా మారి కోలీవుడ్, టాలీవుడ్ నటులకు నిద్రపట్టకుండా చేసింది.  ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాదిన సుచీ లీక్స్ వ్యవహారం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొందరు నటీమణుల పేర్లతో ఒక్కొక్కటిగా వీడియోలు, హాట్ ఫోటోలు బయటకు రావడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ప్రతిరోజూ నెటిజన్లు ‘సుచీలిక్స్ ’లో ఏం వస్తాయో అని రోజూ ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది.  
Image result for suchi leaks
ఇందులో ముఖ్యంగా దనుష్, త్రిష, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఆండ్రియా గురించి ఎక్కువ వచ్చాయి.  అంతే కాదు వీరి తో పాటు  ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ పేరు కూడా ఉంది. ఈ విషయంతో సంబంధమున్న పలువురు హీరో హీరోయిన్లు అప్పుడే స్పందించి వాటిని ఖండించగా అమలా పాల్ మాత్రం ఇన్నాళ్లకు స్పందించారు.  కాకపోతే కాస్త సెటైర్ గా మాట్లాడుతూ..సుచీలీక్స్ ప్రతిరోజు ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విన్నాను.
Related image
అప్పట్లో నాకు సంబంధించి ఏదో ఒక వీడియో లీక్ అవుతుందని చాలా ఎదురు చూశాను కానీ ఒక్కటీ రాలేదు. కానీ భాధాకరంగా ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయిపొయింది’ అన్నారు. అందరినీ అంతలా కంగారుపెట్టి, కొన్ని రోజులపాటు వార్తల్లో సంచలనంగా నిలిచిన ఇలాంటి సెన్సిటివ్ అంశంపై అమలా పాల్ ఇలా స్పందించడం చూస్తుంటే ఈ అమ్మడు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: