తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.   నందమూరి హరికృష్ణ వారసుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తాతకు తగ్గ తనయుడిగా మంచి నటన, డ్యాన్స్, ఫైట్స్ లో తనదైన స్టైల్ ప్రదర్శిస్తూ..తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం  బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు.
Image result for ntr wife family
 ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు..భార్య లక్ష్మీ ప్రణతి... వీరికి ఒక బాబు పేరు అభిరామ్. సాధారణంగా ఎన్టీఆర్ డియో ఫంక్షన్లు, సినిమా రిలీజ్ ఈవెంట్లు మినహాయించి భార్య లక్ష్మీ ప్రణతి ప్రైవేటు పార్టీలకు హాజరైంది లేదు.  తాజాగా ఓ బర్త్‌డే బాష్‌లో  తన భార్య లక్ష్మీ ప్రణతి తో సందడి చేశారు. ఓ నిర్మాత కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి వారు హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు.

అర్ధరాత్రి వరకు ఆ పార్టీలో తారక్ పాల్గొన్నారట.  అంతే కాదు ఈ పార్టీలో హీరో నారా రోహిత్ కూడా హాజరయ్యారట.  ఎన్టీఆర్‌తో కలిసి నారా రోహిత్ పార్టీని బాగా ఎంజాయ్ చేశారట.  ఈ పార్టీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు కె.ప్రకాష్, నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ తదితరులు హాజరయ్యారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: