పవన్ కళ్యాణ్ – సమంత ల కాంబినేషన్ రోజుకో వార్తలకు కేంద్ర బిందువుగా మారుతోంది. నిన్న సమంత కోసం పవన్ హలీమ్ కొని ఇచ్చి మీడియాలో వార్తలకు ఎక్కితే, ఈ రోజు ఏకంగా సమంత ను ఆశిర్వాదిస్తూ పవన్ పోజులు ఇచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి. పై ఫోటోలో సమంత పవన్ కళ్యాణ్ కు నమస్కరిస్తూ ఉండగా, పవన్ ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలే మనోడు భోలా శంకరుడు. సమంత ఏమి అడిగితే తప్పక చేస్తాను అంటూ ఈ ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడో వారిద్దరికే తెలియాలి. బహుశా ఈ స్టిల్ ఈ సినిమాలో ఒక బాగమని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చేనెల 7 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘గబ్బర్ సింగ్’ కన్నా ఈ సినిమా మరింత పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత ప్రసాద్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్టి నమ్మకం మీద ఉన్నారట. ఇక పవన్ అభిమానుల గురించి చెప్పనే చెప్పనక్కరలేదు. వచ్చేనెల 7 వ తారిఖు ఎప్పుడు వస్తుందా..? అంటూ రోజులు లెక్క పెడుతున్నారు. ఈ చిత్రంలో మొట్టమొదటి సారిగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరాని, పవన్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అత్తాపూర్ బాబా గా పవన్ హడావుడి చేయ్యబోతున్నాడనే విషయం ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఇలా రోజుకో వార్త ఈ సినిమాకు సంబంధించి మీడియా కు లీక్ లు వస్తూ ఈ సినిమాపై భారీ క్రేజ్ ను పెంచేస్తున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: