తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు.  అలాంటి దర్శకుల్లో ఒకరు హరిష్ శంకర్.  పవన్ కళ్యాన్ తో ఆల్ టైమ్ రికార్డు చిత్రం ‘గబ్బర్ సింగ్ ’ తో ఒక్కసారే ఫేమస్ అయ్యాడు.  తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ నెల 23 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ‘దువ్వాడ జగన్నాథం’.  ఇప్పటికే ఈ చిత్రాని సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  
Image result for duvvada jagannadham stills
ఇక అల్లు అర్జున్ నటించిన దేశముదురు, ఆర్య, బన్ని నుంచి సరైనోడు వరకు ఫైట్స్, డ్యాన్స్ లో తన ప్రత్యేకత చాటుకున్న విషయం తెలిసిందే.  ఇండస్ట్రీలో మెగా హీరోలు అంటేనే డ్యాన్స్, ఫైట్స్ అందులోనూ ఇంట్రడక్షన్ సాంగ్..క్లయిమాక్స్ ఫైట్ దుమ్మురేపే విధంగా ఉండాలని కోరుకుంటారు ఫ్యాన్స్.   బన్ని నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌తాడు.
Related image
ఒక పాత్రలో అమాయకంగా కనిపిస్తున్న బన్నీ రెండో పాత్రలో చాలా వైలెంట్, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ట్రైల‌ర్ చూస్తుంటే ప‌క్కా మాస్ ఫైట్స్ ఉంటాయ‌నుకునేవారికి క్లైమాక్స్‌లో ఫైట్ లేద‌ని షాకిచ్చాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ . తాజాగా ఈ చిత్రంలో ఓ టాప్ సీక్రెట్ ని బయట పెట్టారు దర్శకులు హరీష్ శంకర్.  

Image result for duvvada jagannadham stills

ఈ సినిమాలో మొదట భారీ క్లయిమాక్స్ ప్లాన్ చేశారట..కానీ ప్రీ క్లైమాక్స్‌లోనే భారీ ఫైట్ ఉంటుంది..మళ్లీ క్లయిమాక్స్ భారీ ఫైట్ ఎందుకని అల్లు అర్జున్ అనడంతో..హ‌రీష్ కూడా బ‌న్ని ఆలోచ‌న బావుంద‌ని, ఎంట‌ర్‌టైనింగ్ వేలో క్లైమాక్స్‌ను తెర‌కెక్కించాడ‌ట‌. ఈ విష‌యాన్ని హ‌రీష్ చెప్పేశాడు. ఓ ర‌కంగా దువ్వాడ‌లో ని ఓ సీక్రెట్‌ను హ‌రీష్ బ‌య‌ట‌పెట్టేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: