ముంబై, అంధేరీ పశ్చిమ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో అర్ధ నగ్నంగా కృతికా చౌదరి  మృతి నిన్న కలకలం ముంబాయి సినిమా ఇండస్ట్రీలో పెద్ద కలకం రేపింది.  అయితే పోలీసులు కేసు ఫైల్ చేసిన 24 గంటల్లోనే కేసు ఛేదించారు.  అయితే  కృతికా ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని తేల్చిన పోలీసులు, హత్యకు ముందు అత్యాచారం జరగలేదని తేల్చారు. ఆమెను పిడికిలికి ధరించే లోహాయుధం (కున్ కుల్ డస్టర్)తో తలపై కొట్టి హత్య చేశారని, కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని, హత్యకు వినియోగించిన ఆయుధాన్ని గుర్తించామని తెలిపారు.
Image result for kritika choudhary murder
సినిమా ఇండస్ట్రీలో నమ్ముకొని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చిన కృతిక ప్రస్తుతం ఆ అపార్ట్ మెంట్ లో ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మోడల్ గా కొన్ని టివి షోస్ లో పాల్గొంటున్న కృతికా ఈ నెల 5న తన పుట్టిన రోజు జరుపుకున్నట్లు తెలుస్తుంది.  ఆ తర్వాత ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలుపుతున్నారు.
Image result for kritika choudhary murder
 హరిద్వార్ లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు హత్య సమాచారాన్ని అందించామని, నేడు వారు ముంబైకి చేరుకోవచ్చని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అపార్టుమెంట్ వాచ్ మన్, భైరవ్ నాథ్ సొసైటీలో కృతికా రెగ్యులర్ గా వెళ్లే షాపుల యజమానులను ప్రశ్నించి, ఆపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. ట్విస్ట్ ఏంటంటే..రెండు సంవత్సరాల క్రితం కృతికా చౌదరి భర్తతో విభేదాలు రావడంతో తెగతెంపులు చేసుకున్నట్లు..ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నట్లు ఈ క్రమంలోనే ఆమె హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: