Image result for dangal record in images

ఆమిర్ ఖాన్ ప్రథాన పాత్రలో అంటే మహవీర్ సింగ్ పోగట్ అనే  మల్లయుద్ధ వీరుడు మరియు ఓలంపిక్స్ కోచ్ పాత్రలో నటించి తెరకెక్కించిన "దంగల్" హిందీ చిత్ర సంచలనాలు, ప్రవాహంలాగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ లో భారీ వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా "ఓవర్-సీస్ లోనూ తన హవా" చూపించింది. 


తరువాత చైనా రిలీజ్ తో ఇండియన్ సినిమా (హిందీ సినిమా-బాలీవుడ్) కలెక్షన్ల స్టామినా ఏంటో ఋజువు చేసింది. ఈ సరికొత్త  రికార్డ్ తో  "ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్-ఇంగ్లీష్ బాషల సినిమాల వరసలో ఐదో స్థానం" లో నిలిచింది. ఈ వారాంతానికి $ 301 మిలియన్ డాలర్ల (1930 కోట్ల రూపాయల) తో సరికొత్త చరిత్ర సృష్టించ నుంది దంగల్ అంటున్నారు.


భారత్ లో $ 84.40 మిలియన్ డాలర్లు వసూళ్ళు చేసిన దంగల్, చైనాలో $ 179.80 మిలియన్ డాలర్లు వసూళ్ళు సాధించి "భారత్ లో కంటే చైనాలోనే అత్యధికంగా  (అంటే రెట్టింపుకంటే ఎక్కువ) వసూళ్ళు చేసింది. మాతృభాషలో కంటే మాతృ దేశంలో కంటే చైనాలోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన తొలి (గొప్ప) రికార్డ్ సృష్టించిన ఘనత దంగల్ సినిమాదే. ఇతర ప్రాంతాలతో కలుపుకొని $ 300 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్ళు చేసింది దంగల్. 

Image result for dangal record in images

ఈ రికార్డ్ సృష్టించడం మాత్రమే కాదు:
  
*అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రం 
*$ 300 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటిన "ఐదో నాన్-ఇంగ్లీష్ సినిమా" నిలిచింది.
 
దంగల్ కన్నా ముందు నాలుగు స్థానాలు దక్కించుకున్న నాన్-ఇంగ్లిష్ సినిమాలు.
 
*ది మెర్మైడ్ ($533 మిలియన్స్) - చైనా
*మాంస్టర్ హంట్($ 386 మిలియన్స్) - చైనా 
*ది ఇంటచబుల్స్ ($ 427 మిలియన్స్) - ఫ్రాన్స్ 
*యువర్ నేమ్($ 354 మిలియన్స్) - జపాన్ మూవీ మాత్రమే ఉన్నాయి.

Image result for dangal record in images

బ్లాక్-బస్టర్ ఒఫ్ ఇండియా ఇన్ ఇండియా ఓన్లీ  

మరింత సమాచారం తెలుసుకోండి: