పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు చెప్పండి. టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ అయిన రకుల్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జత కట్టాలని చూస్తుంది. ఇప్పటికే రాం చరణ్, ఎన్.టిల్.ఆర్, అల్లు అర్జున్ ల సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ తో మహేష్ పక్కన కూడా జోడి కట్టింది.


ఇక పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరు మాత్రమే మిగిలున్నారు. ప్రభాస్ తో ఏమో కాని పవన్ తో మాత్రం పవన్ ఛాన్స్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో పవన్ చేస్తున్న సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్ మూవీలో రకుల్ హీరోయిన్ గా ఫైనల్ చేస్తున్నారట.


తమిళ సినిమా రీమేక్ గా రాబోతున్న ఈ మూవీ నవంబర్ లో మొదలవుతుందని తెలుస్తుంది. ఎంతమది హీరోలతో చేసినా పవన్ తో చేయాలనే రకుల్ కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ పవన్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: