ఈ మద్య సినిమా ప్రమోషన్ల కోసం తారలు చేస్తున్న జిమ్మిక్కులు చూస్తే అందరూ షాక్ తింటున్నారు.  సాదా సీదాగా గా మారి జనాల్లోకి వెళ్తూ సినిమా తారలు చేస్తున్న హంగామా చూస్తే నిజంగా మా పక్కన ఉంది సినిమా నటులా అన్న ఆశ్చర్యానికి లోనవుతున్నారు సామాన్యలు.  ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఆటో డ్రైవర్ కి భలే షాక్ ఇచ్చాడు.  అంతే కాదు సల్మాన్ ఖాన్ సాదా సీదా మనిషి అని తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.  
Salman Khan, Salman Khan auto ride, Salman, Salman Khan latest photos, Salman Khan auto fare
ఆ మద్య ‘ట్యూబ్ లైట్’ సినిమా ప్రమోషన్లో భాగంగా స్లమ్ ఏరియాకి వెళ్లిన సల్మాన్ అక్కడో ఓ చిన్నారి పాపను ముద్దు పెట్టుకున్నాడు.  తాజాగా  తన సోదరుడు సొహైల్ ఖాన్ పుట్టినరోజు వేడుకల కోసం సల్మాన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముంబైలో బయటకు వెళ్లారు. బర్త్ డే వేడుక ముగియగానే సల్మాన్ ఖాన్ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు తన కారులో కాకుండా ఆటో ఎక్కాడు.   ఆటోలో సల్మాన్ ఇంటికి చేరుకునేసరికి అయిన మీటరు ఛార్జి రూ.50. అయితే, సల్మాన్ మాత్రం రూ.1000 ఇవ్వడంతో డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.  
Related image
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..నా ఆటో ఎక్కిన సల్మాన్ ఖాన్ ని చూసి నేను కాసేపు నమ్మలేక పోయాను..అయితే ఆయన మాత్రం ఆటోలో ప్రయాణించేంత సేపు ఏమీ మాట్లడలేదని కాకపోతే కాస్త వేగంగా వెళ్లమని మాత్రం చెప్పాడని అన్నారు.  ఇక సల్మాన్ ఖాన్ ఇంటి ముందు నా ఆటో ఆపగానే ఆటో మీటర్ చార్జి 50 అని చెప్పడంతో ఆయన డ్రైవర్ తో మాట్లాడమని తనకు చెప్పారని తెలిపాడు.
Image result for salman khan auto journey
ఇక సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్   తన చేతిలో రూ.1000 పెట్టి చిరునవ్వు చిందించారని సంజయ్ కుమార్ సింగ్ చెప్పారు.  అయితే సల్మాన్ ఖాన్ ఆటోలో ప్రయాణించడం ఇదే కొత్త కాదు..గతంలో కూడా తన స్నేహితుడితో ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: