తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడీ అని పిలిచేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు..అది హీరో - హీరోయిన్ విషయమే కావోచ్చు..మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుల విషయమే కావొచ్చు.  అయితే కొన్ని కాంబినేషన్లో వచ్చే సినిమాలు యవర్ గ్రీన్ హిట్స్ గా మిగిలిపోతుంటాయి..అలాంటి హిట్ కాంబినేషన్ త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్.   వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.  అంతే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు కావడం విశేషం.  
Image result for trivikram pawan
ప్రతి ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ కి తోడుగా రావడం గమనిస్తుంటాం.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.  పవన్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మానుయేల్ నటిస్తున్న ఈ చిత్రంలో అత్తగా ఒకనాటి గ్లామర్ నటి కుష్బూ నటిస్తోంది. ప్రస్తుతం పవన్ కి మామగా మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కోసం ప్రయత్నాలు చేస్తన్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ అది సెప్టెంబర్ లోనా లేక అక్టోబర్ లోనా అన్నది తేలాల్సి ఉంది .
Image result for trivikram pawan
ఆ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ చేయలేదట. దర్శకులు త్రివిక్రమ్ ఆలోచనల మేరకు టీజర్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేయాలనీ అనుకున్నారు.  అయితే  పవన్ కళ్యాన్ మాత్రం ఇప్పుడే అవేవి వద్దని త్రివిక్రమ్ గట్టిగా చెప్పాడట.  ఒకవేళ టీజర్ తో పాటే టైటిల్ రిలీజ్ చేస్తే తప్పని సరిపరిస్థితుల్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుందని సినిమా పూర్తి అయ్యే టైమ్ లో ఇలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని చెప్పడంతో త్రివిక్రమ్ వెనక్కి తగ్గాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: