ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రశంసలు పొందిన ‘బాహుబలి2’ కి విడుదల కాకుండానే చైనాలో షాక్ తగిలింది  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పడుతున్న ‘బాహుబలి 2’ ను విడుదల చేసేందుకు ఈసినిమా గతకొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘బాహుబలి 2’ చిత్రంపై చైనాలో అంతగా స్పందన కనిపించడంలేదని లేటెస్ట్ న్యూస్.

బాలీవుడ్ ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం చైనాలో చరిత్ర సృష్టించిన నేపధ్యంలో అదే మ్యాజిక్ ను రిపీట్ చేద్దామని ‘బాహుబలి 2’ నిర్మాతలు గత కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళడం లేదు. 

విదేశీగడ్డ పై 1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన తొలిచిత్రంగా ‘దంగల్’ ఇప్పటికే ఒక అరుదైన  రికార్డును సొంతం చేసుకుంది. మే 5వ తేదీన విడుదలైన ఈచిత్రం ఇప్పటికీ చైనాలో ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. చైనాలో సాధారణ ప్రేక్షకుల నుంచి ఆదేశ అధ్యక్షుడి వరకు ‘దంగల్‌’ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఈమధ్యన మన భారతదేశ ప్రధానితో చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో మాట్లాడినప్పుడు వారిద్దరి మాటలలో ‘దంగల్’ ప్రస్తావన రావడమే కాకుండా తాను భారతీయ చిత్రం ‘దంగల్’ ను చూశానని చైనా అధ్యక్షుడు మన ప్రధానితో అన్నారు అంటే ‘దంగల్’ చైనా ప్రజల మనసుల్లోకి ఎలా చొచ్చుకు పోయిందో అర్ధం అవుతుంది. చైనాలో ‘దంగల్’ ప్రభంజనం తర్వాత ‘బాహుబలి 2’ ను రాబోతున్న సెప్టెంబర్ లో చైనాలో విడుదల చేయబోతున్నారు. 

అయితే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ‘బాహుబలి 2’ పై ఆ శక్తికనబరచక పోవడానికి ‘బాహుబలి 2’ కు మించిన భారీ సాంకేతిక విలువలు ముఖ్యంగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటి అత్యంత సాంకేతిక విలువలు ఉన్న అనేక సినిమాలను ఇప్పటికే చూసిన నేపధ్యంలో ‘బాహుబలి 2’ పట్ల పెద్దగా చైనాలో ఆసక్తి లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ‘బాహుబలి 2’ 2000ల కోట్ల సినిమాగా మారే విషయం పగటి కల మాత్రమే అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: