మన పూర్వికులు అంటుంటారు..ప్రతి మనిషికి పూర్వజన్మ..మరు జన్మలు ఉంటాయని..అయితే అవి వారి కర్మ సిద్దాంతాన్ని బట్టి ఉంటాయని అంటారు.  ఇక సినిమా ఇండస్ట్రీలో పూర్వ జన్మలకు సంబంధించి ఎన్నో చిత్రాలు వచ్చాయి..కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  మన పెద్దలు అంటుంటారు..నువ్వు పూర్వ జన్మలో పలనా..అందుకే ఈ జన్మలో ఇలా జన్మించావు అని.  అంతే కాదు నిజ జీవితంలో కూడా కొన్ని పూర్వజన్మలకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Image result for jr ntr
 ప్రతి మనిషికి గ‌త జ‌న్మలో మ‌నం ఎక్క‌డ ఏ రూపంలో జన్మించాం? అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలో విప‌రీత‌మైన ఆస‌క్తి క‌లిగిస్తుంది.  ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన పూర్వ జన్మ రహస్యాలు న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్  వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్  సెలెబ్రిటీకి చెందిన గత జన్మ గురించి చెబుతున్నారు.  
Image result for పూర్వ జన్మ ఎన్టీఆర్
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి మరి కొందరి పూర్వజన్మల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.  తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  గత జన్మలో బ‌న్నీ ఎలా ఉండేవాడు..? ఆయన మనస్తత్వమేంటి..? వ‌ంటి ఆస‌క్తిర‌మైన విష‌యాల‌ను తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.   అల్లు అర్జున్ గురించి ఆయన చెప్పిన కొన్ని అంశాలు అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

గ‌త జ‌న్మ‌లో బ‌న్నీ  ఉత్త‌ర భార‌తంలో సాధర‌ణ రైతు కుటుంబంలో జ‌న్మించాడ‌ని.. నీటి కోసం  భగీరధ ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని చెప్పుకొచ్చాడు.  అంతే కాదు  బ‌న్నీకి ఒక‌సమ‌యంలో ఆపార గుప్త‌నిధి దొరికింద‌ని, ఆ నిధిని అంతా స‌మాజ శ్రేయ‌స్సుకు ఉప‌యోగించాడ‌ని ఆయ‌న తెలిపారు.తాజాగా ప్ర‌సారం చేసిన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: